క్షయ వ్యాధి నిర్మూలనకు అవగాహన అవసరం: కలెక్టర్
WGL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక-99లో భాగంగా మంగళవారం వైద్యశాఖ ఆధ్వర్యంలో క్షయ వ్యాధి నిర్మూలనపై నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్షయ వ్యాధి లక్షణాలు, పరీక్షలు, చికిత్సపై ప్రజల్లో చైతన్యం పెంపొందించాలని సూచించారు. వ్యాధిగ్రస్తులకు తగిన మందులు పంపిణీ చేయాలని కోరారు.