గత ప్రభుత్వం దొంగలకు పెన్షన్లు ఇచ్చింది: CM

AP: గత ప్రభుత్వం దొంగలకు కూడా దివ్యాంగులకు పెన్షన్లు ఇచ్చిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. తమ ప్రభుత్వం అనర్హులకు కట్ చేసి అర్హులకు మాత్రమే ఇస్తోందని తెలిపారు. పనిగట్టుకుని మరీ నెట్టింట దివ్వాంగుల పెన్షన్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తమది సంక్షేమ రాజకీయం అయితే వాళ్లది సంక్షోభ రాజకీయమన్నారు. వాళ్లది క్రిమినల్ రాజకీయం అయితే తమది విజన్ రాజకీయం అంటూ విమర్శించారు.