'కూటమి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి'

'కూటమి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి'

SKLM: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మీడియాపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని.. ఇలాంటి చర్యలు మానుకోవాలని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చూపిస్తున్న మీడియాపై పోలీసులతో తప్పుడు కేసులు నమోదు చేయించడం సరికాదని, చంద్రబాబు మీడియా స్వేచ్ఛను హరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.