జి1-బి, జి1-సి గదులలో ప్రజావాణి కార్యక్రమం: కలెక్టర్
ASF: ఈ నెల 27న నిర్వహించు ప్రజావాణి కార్యక్రమం ఆసిఫాబాద్ సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గల జి1-బి, జి1-సి గదులలో నిర్వహిస్తున్నట్లు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించి తమ దరఖాస్తులను అందించాలని తెలిపారు.