'మాజీ ఎమ్మెల్యే పై విమర్శలు తగవు'
CTR: పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ గౌడపై టీడీపీ నాయకుల విమర్శలు తగవని వి.కోట ఎంపీపీ యువరాజు అన్నారు. వి.కోటలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పలు హామీలను ఇంకా అమలు చేయాల్సి ఉందని చెప్పారు. వాటిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం కొత్తగా ఒక పింఛన్ కూడా మంజూరు చేయలేదని విమర్శించారు.