'చోరీకి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులు'

HNK: కాజీపేట మండల కేంద్రంలో అడ్డగుడి సతీష్ అనే యువకుని ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం తెల్లవారుజామున చోరీకి పాల్పడ్డారు. సీఐ సుధాకర్ రెడ్డి కథనం ప్రకారం ఇంపీరియల్ కాలనీకి చెందిన సతీష్ ఇంటికి తాళం వేసి టూర్ కి వెళ్ళగా గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి రూ.60 వేల విలువచేసే బంగారు వస్తువులు అపహరించారు. కేసు విచారణలో ఉంది.