VIDEO: యూరియా కోసం రైతుల రాస్తారోకో

VIDEO: యూరియా కోసం రైతుల రాస్తారోకో

MDK: తూప్రాన్ పట్టణంలో మంగళవారం యూరియా కోసం రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి రైతులు ఉదయమే చేరుకున్నారు. యూరియా లేకపోవడంతో అక్కడే పాత హైవే రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు విచ్చేసి రైతులను సముదాయించారు