ఓటరు జాబితా మ్యాపింగ్ ప్రారంభం
MNCL: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మంచిర్యాలలో ఓటరు జాబితా మ్యాపింగ్ ప్రారంభమైంది. బూత్ లెవల్ ఆఫీసర్లు 2002 ఓటరు జాబితాలో 40 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రస్తుత ఓటర్లను 2025 ఓటర్ జాబితాను మ్యాపింగ్ చేస్తున్నారు. ఓటరు జాబితా మ్యాపింగ్ ప్రక్రియను తహసీల్దార్ రఫతుల్లా హుసేన్ పరిశీలించారు. పొరపాట్లకు తావులేకుండా మ్యాపింగ్ చేయాలని సూచించారు.