ఎమ్మెల్యేని సన్మానించిన మార్కెట్ కమిటీ సభ్యులు

కృష్ణా: గన్నవరం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నామినేటెడ్ పోస్టుకు ప్రభుత్వం జీవో జారీ చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును కమిటీ సభ్యులు సన్మానించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, రైతు ప్రతినిధులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ప్రాంతీయ మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.