విజయవాడలో ఘనంగా కృష్ణాష్టమి

విజయవాడలో ఘనంగా కృష్ణాష్టమి

NTR: జిల్లాలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. విజయవాడ ఇస్కాన్‌ ఆలయంలో వేలాదిమంది భక్తులు గోకులకృష్ణుడి దర్శనం కోసం తరలివచ్చారని ఇస్కాన్ ఆలయ ప్రెసిడెంట్ చక్రధర్ తెలిపారు. ఆలయ ప్రాంగణం శోభాయమానంగా అలంకరించగా, చిన్నారులు రాధా, కృష్ణ వేషధారణలో ఆకట్టుకున్నారు. ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.