పలాసలో మట్టి మాఫియా
SKLM: పలాస మండలం మోదుగులపుట్టిలో మట్టి మాఫియా అక్రమాలు బహిరంగంగానే సాగుతున్నాయి. రైతులు పొలం లోతు చేసుకుంటామని చెప్పి తహసీల్దార్ కార్యాలయానికి దరఖాస్తులు చేసుకుంటున్నా, వాస్తవానికి వందలాది ట్రాక్టర్లతో మట్టిని వెంచర్లకు, ఇటుక బట్టీలకు తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిని అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.