VIDEO: 'బాలుడి ఆరోగ్యం నిలకడగానే ఉంది'
GNTR: నల్లచెరువులో ఆరు సంవత్సరాల ఫణిందర్ రెడ్డిపై కుక్కలు దాడి చేసిన ఘటనపై గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ వివరాలు వెల్లడించారు. బాలుడికి ఐదారు కుక్క గాట్లు ఉండగా, గాయాలను పూర్తిగా శుభ్రపరిచి అవసరమైన చికిత్స అందించి యాంటీ రేబీస్ టీకా ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని, భయపడాల్సిన అవసరం లేదన్నారు.