కాజీపేట నుంచి 9 ప్యాసింజర్ రైళ్లు రద్దు

వరంగల్: కాజీపేట నుంచి వెళ్లే 9 ప్యాసింజర్ రైళ్లను ఈ నెల 5 వరకు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. బల్లార్షా-కాజీపేట (17036, 17004), కాజీపేట-సిర్పూర్ కాగజ్‌నగర్ (17003), సికింద్రాబాద్-వరంగల్ (67761), వరంగల్-సికింద్రాబాద్ (67762), సికింద్రాబాద్-కాజీపేట (67763), కాజీపేట-సికింద్రాబాద్ (67764), కాజీపేట-డోర్నకల్ (67765) రైళ్లు రద్దయ్యాయని పేర్కొన్నారు.