రహదారి భద్రత మనందరి బాధ్యత: డీఎం
NLG: దేవరకొండ ఆర్టీసీ డిపోలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం రహదారి భద్రతపై డిపో మేనేజర్ విజయకుమారి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొని ప్రజలలో రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితమైన డ్రైవింగ్ చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ పడాల సైదులు, తదితరులు పాల్గొన్నారు.