'5 రోజులుగా సెల్ ఫోన్ నెట్‌వర్క్ లేక ఇబ్బందులు'

'5 రోజులుగా సెల్ ఫోన్ నెట్‌వర్క్ లేక ఇబ్బందులు'

MNCL: నెన్నెల మండలం కొత్తూరు, చిన్న వెంకటాపూర్, పొట్యాల గ్రామాల్లో గత 5 రోజులుగా సెల్ ఫోన్ నెట్‌వర్క్ సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 3 గ్రామాల మొబైల్ వినియోగదారులందరూ అత్యవసర పరిస్థితుల్లో అవస్థలు పడుతున్నారు. తీవ్ర ఈదురుగాలులు, వర్షాలప్పుడు ఏదైనా జరిగితే అధికారులను ఎలా సంప్రదించాలని పేర్కొంటున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.