VIDEO: హైవేపై ప్రమాదకరంగా ధాన్యం ఆరబోత

ELR: దెందులూరు మండలం కొత్తగూడెం ముప్పవరం గ్రామాల పరిధిలో రహదారిపై ధాన్యం ఆరబోత ప్రమాదకరంగా ఉంది. ప్రస్తుతం ఖరీఫ్ పంట పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పొలాల్లో ధాన్యం ఆరబెట్టడానికి వాతావరణం అనుకూలంగా లేనందున రహదారులపైకి తీసుకువచ్చి ఆరబెడుతున్నారు. ఈ క్రమంలో హైవేపై సగం వరకు ధాన్నాన్ని ఆరబెట్టడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు.