ఘనంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహణ

ఘనంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహణ

ప్రకాశం: కొమరోలు మండలంలో శ్రీరామనవమి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని పల్లె గ్రామాల్లో వెలసిన రాములవారి దేవాలయాలలో సీతారాముల కల్యాణాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు సీతారాముల స్వామి వారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ప్రసాదంగా పెట్టిన పానకం, వడపప్పును భక్తులు స్వీకరించారు.