పెట్రోల్ దొరకక ప్రజల ఇబ్బందులు

పెట్రోల్ దొరకక ప్రజల ఇబ్బందులు

NTR: కంచికచర్ల పట్టణంలో పెట్రోల్ కొరత తీవ్రమైంది. బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు క్యూ కట్టాయి. గంటల తరబడి వేచి చూస్తున్నా పెట్రోల్ దొరకక వాహనదారులు, విద్యార్థులు అల్లాడిపోతున్నారు. 'నో స్టాక్' బోర్డులతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సరఫరాను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.