పొగమంచు ప్రయాణం.. అప్రమత్తత అవసరం

పొగమంచు ప్రయాణం.. అప్రమత్తత అవసరం

SRPT: జిల్లాలో చలితీవ్రత, పొగమంచు పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నరసింహ సూచించారు. రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే ముప్పు ఉందన్నారు. తక్కువ వేగంతో వెళ్లాలని, ఇండికేటర్లు వాడుతూ క్రమశిక్షణతో ప్రయాణించాలని కోరారు. డ్రైవర్లు నిబంధనలు పాటించాలని ఎస్పీ స్పష్టం చేశారు.