రైతులను విస్మరించిన కూటమి ప్రభుత్వం

రైతులను విస్మరించిన కూటమి ప్రభుత్వం

VZM: కూటమి ప్రభుత్వం రైతులను విస్మరించిందని వైసీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు మంత్రి అప్పలనాయుడు అన్నారు. బుధవారం గజపతినగరంలోని వైసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో ఎరువులు విత్తనాలు సకాలంలో అందించి ఆదుకోగా, ప్రస్తుతం కూటమి పాలనలో ఎరువులు దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. జడ్పీటీసీ తవుడు శ్రీనివాసరావు పాల్గొన్నారు.