గ్యాస్ సిలిండర్ల లారీకి ప్రమాదం
NDL: పాణ్యం శాంతిరాం ఫార్మసీ కాలేజీ సమీపంలో గురువారం గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీ ప్రమాదానికి గురైంది. యూటర్న్ తీసుకుని KRNLకు వెళ్లే క్రమంలో, నంద్యాల వైపు వస్తున్న కంకరలోడు టిప్పర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో గ్యాస్ లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంతో గ్యాస్ లారీ ముందుభాగం ధ్వంసమైంది. దీంతో రహదారి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.