పెద్దపల్లిలో రేపు అప్రెంటిషిప్ మేళా
పెద్దపల్లి ప్రభుత్వ ఐటిఐ ప్రాంగణంలో మార్చి 9న ఐటిఐ పూర్తిచేసిన అభ్యర్థులకు అప్రెంటిషిప్ మేళ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ వెంకట్ రెడ్డి తెలిపారు. ఎలక్ట్రిషన్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, డీజిల్ మెకానిక్, COPA-పూర్తిచేసిన అభ్యర్థులు ఉదయం 9:30 గంటలకు దృవపత్రాలతో హాజరుకావాలని సూచించారు.