పలు శుభకార్యాలలో పాల్గొన్న ఎమ్మెల్యే

BDK: దమ్మపేట మండలం నాగుపల్లి గ్రామంలో పొలగాని వారి వివాహవేడుకలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు. ఈ మేరకు అదే గ్రామంలో కనపర్తి వారి అన్నప్రాసన వేడుక చండ్రుగొండ మండలం తుంగారం గ్రామంలో నోముల వారి వివాహ వేడుక, మొండితోక వారి వివాహ వేడుకలకు హాజరయ్యారు. అనంతరం నూతన దంపతులను ఆశీర్వదించి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.