మంచు దుప్పటిలో కేదార్‌నాథ్
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ధామ్‌లో కురుస్తున్న భారీ హిమపాతం కారణంగా మంచు దుప్పటి కప్పుకుంది. ఈనెల 22న ఆలయ ద్వారాలు తెరుచుకోనున్న నేపథ్యంలో, ఈ ప్రతికూల వాతావరణం యాత్ర ఏర్పాట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆలయ పరిసరాల్లో జరుగుతున్న నిర్మాణ పనులు, శుభ్రత వంటి పనులు నెమ్మదించాయి. యాత్ర ప్రారంభానికి ముందే మంచును తొలగించి సిద్ధం చేయడం అధికారులకు సవాలుగా మారింది.