రేపు డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా

రేపు డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా

ADB: ఆదిలాబాద్ శాంతినగర్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రేపు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ సంగీత తెలిపారు. టీఎస్‌కేసీ ఆధ్వర్యంలో టాస్క్, మ్యాజిక్ బస్ ఫౌండేషన్ సౌజన్యంతో జరిగే మేళాలో 15 వరకు ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన అభ్యర్థులు అర్హులని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.