మానవత్వం చాటుకున్న పారిశుద్ధ్య కార్మికులు

SRPT: వానరానికి అంత్యక్రియలు నిర్వహించి పారిశుద్ధ్య కార్మికులు మానవత్వం చాటుకున్నారు. మోతె మండలం విభళాపురంలో ఓ వానరం ప్రమాదవశాత్తు గాయపడి మృతి చెందింది. స్థానిక యువకుల సమాచారంతో పారిశుద్ధ్య కార్మికులు, యువకులు వానరానికి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించి, పూజలు చేశారు.