యూరియా కోసం పాలకొండలో బారులు

PPM: పాలకొండ మండలంలో యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోంది. అధికారులు యూరియా కొరతలేదని ప్రకటనలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం దొరకడం లేదు. మంగళవారం పాలకొండలోని ఓ ఎరువుల దుకాణం వద్ద యూరియా కోసం రైతులు పడికాపులు కాస్తున్నారు. వరి పంట వేసి నెలలు కావస్తున్నా యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.