అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

KDP: తొండూరు మండలం యాదవకుంట గ్రామానికి చెందిన వల్లపు చెన్నారెడ్డి అప్పుల బాధ తాళలేక ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం మేరకు.. సదరు వ్యక్తి కొంతమంది వద్ద అధిక వడ్డీకి కొంత డబ్బును అప్పులు తెచ్చుకుని తీర్చే మార్గం లేక విషపు గుళికలను మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం  ఆసుపత్రికి తరలించారు.