VIDEO: అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
VSP: కొత్త అమావాస్య సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రహ్లాదపురం, కృష్ణానగర్, గంగిరెడ్ల కాలనీ, వరలక్ష్మీనగర్ ప్రాంతాల్లోని నూకాలమ్మ ఆలయాలను బుధవారం దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రైతులకు మంచి పంటలు రావాలని కోరుకున్నట్లు తెలిపారు.