'వరద ముంపా..? హైడ్రాకు కాల్ చేయండి'

HYD: నగరంలో ఈరోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో గ్రేటర్, హైడ్రా అధికారులు అప్రమత్తమయ్యారు. నీరు నిలవకుండా చర్యలు చేపడుతున్నారు. ఉన్నతాధికారులు సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వరదముప్పు ఏర్పడితే హైడ్రా కంట్రోల్ రూమ్ నంబర్ 9000113667కు సమాచారం ఇవ్వాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.