ఈనెల 15వ తేదీన షాపులకు బహిరంగ వేలం

BDK: పాల్వంచ పెద్దమ్మ తల్లికి ఆలయ అర్చకులు పంచామృతాలతో శుక్రవారం అభిషేకం జరిపారు. మేళ తాళాలతో జన్మస్థలం వద్ద ఉన్న అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు హారతి సమర్పించి తల్లికి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఈనెల 15వ తేదీన ఉదయం 11 గంటల నుంచి షాపుల నిర్వహణ కోసం ఆలయ ప్రాంగణంలో టెండర్‌కు బహిరంగ వేలం ఉంటుందని ఆలయ ఈవో రజనీకుమారి తెలిపారు.