మున్సిపాలిటీల వారీగా పోలింగ్ వివరాలు
KMM: ఎదులాపురంలో 11 గంటలకు 40.19 శాతం నమోదు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఎదులాపురంలో వేగంగా సాగుతోంది. బుధవారం ఉదయం 11 గంటల సమయానికే 40.19 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 43,811 మంది ఓటర్లకు గాను, సుమారు 17,606 మంది తమ హక్కును వినియోగించుకున్నారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఓటింగ్ ప్రక్రియ ఎటువంటి అంతరాయం లేకుండా ప్రశాంతంగా కొనసాగుతోంది.