హర్మూజ్‌కు 5వేల మంది బలగాలు.. అందుకేనా?
అమెరికా ప్రభుత్వం హర్మూజ్ జలసంధి వద్దకు భారీగా సెయిలర్లు, మెరైన్లను పంపింది. హర్మూజ్ భద్రతతో పాటు.. ఇరాన్ చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం కోసమే ఈ బలగాలను పంపుతున్నట్లు అమెరికా వర్గాల వెల్లడించాయి. ఈ పరిణామాలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. భూఆక్రమణకు ప్రయత్నిస్తే పర్షియన్ గల్ఫ్‌లో మరిన్ని సీ మైన్స్‌ను పెడతామని బెదిరింపులకు పాల్పడింది.