చిల్లర లేక చింతిస్తున్న ప్రయాణికులు
కృష్టా: విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో బస్‌పాస్‌లకు ఆన్‌లైన్ చెల్లింపుల లేమి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తోంది. చిల్లర తప్పనిసరిగా తెచ్చుకోవాలని కౌంటర్ల వద్ద ఉన్న బోర్డులు ప్రయాణికులను అవాక్కు చేస్తున్నాయి. డిజిటల్ పేమెంట్లు విస్తృతమయ్యినా RTC మాత్రం నగదుకే పరిమితమై ఉంది. పాస్‌లు తీసుకునే ప్రయాణికులు వెంటనే ఆన్‌లైన్ సదుపాయం కోరుతున్నారు.