'దేవనకొండను కరవు మండలంగా ప్రకటించాలి'
KRNL: దేవనకొండలో ఇవాళ జరిగిన సర్వసభ్య సమావేశాన్ని ఎమ్మెల్యే విరుపాక్షి, వామపక్ష నాయకులు వీరశేఖర్, నరసరావు ఆధ్వర్యంలో దాదాపు గంటపాటు అడ్డుకున్నారు. అధిక వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతుల కోసం మండలాన్ని కరవు మండలంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీపీ, ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.