కళాశాల ఎదుట విద్యార్థుల ఆందోళన
శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ విద్యార్థి ప్రత్తిపాటి సృజన్ (20) మృతిపై తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు ఆందోళనకు దిగారు. కళాశాల ఆవరణలో బైఠాయించి నిరసన తెలిపారు. సీనియన్ విద్యార్థుల దాడితోనే సృజన్ చనిపోయాడని.. బాధ్యులను సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. సీనియర్ విద్యార్థుల దౌర్జన్యాలు, దాడులు పెరిగిపోయాయని జూనియర్ విద్యార్థులు ఆందోళన చేశారు.