కేతకి భూమి పత్రాలు EOకు దాత అందజేత
SRD: ఝరాసంగం కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయానికి హుమ్నాబాద్‌కు చెందిన దాత దత్తు కుమార్ చిద్రి భూమిని విరాళంగా సమర్పించారు. క్షేత్ర పరిధిలోని సర్వేనంబర్ 12, 8లో ఆలయ ముఖద్వారం వద్ద ఉన్న 1.01ఎకరం భూమిని స్వామివారి పేరిట సోమవారం రిజిస్ట్రేషన్ చేయించి భూమి పత్రాలను EO శివ రుద్రప్పకు అందజేశారు. అనంతరం దాతకు ఘనంగా సన్మానించారు.