వైసీపీ అధినేత జగన్‌తో జిల్లా పార్టీ నేత భేటీ
AKP: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను జగన్ దృష్టికి ఆయన తీసుకువెళ్లారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని జగన్ సూచించినట్లు పేర్కొన్నారు.