'జాతీయ రహదారి విస్తరణ పనులను చేపట్టాలి'

కడప: రేణిగుంట జాతీయ రహదారి విస్తరణ పనులను సంబంధించిన అధికారులు వెంటనే చేపట్టాలని సిద్ధవటం జనసేన నేత పసుపులేటి కళ్యాణ్ పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. కడప తిరుపతి జాతీయ రహదారిపై ఎందరో రోడ్డు ప్రమాదంలో మరణించారన్నారు. ఫోర్ లైన్ ద్వారా ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందన్నారు. విస్తరణ పనులు పూర్తయ్య వరకు స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలన్నారు.