విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి.. మంత్రి దిగ్భ్రాంతి

విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి.. మంత్రి దిగ్భ్రాంతి

AP: ప్రకాశం జిల్లాలో విద్యుత్ షాక్‌తో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.