ఢిల్లీలో ఆందోళనకరంగా వాయు కాలుష్యం
ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకీ తారా స్థాయికి చేరుకుంటుంది. ఉ.8 గంటల సమయంలో గాలి నాణ్యత 351గా నమోదైంది. బురారీ, ఆనంద్ విహార్, చందానీ చౌక్, ఐటీఓ, జహంగీర్ పురితో పాటు పలు ప్రాంతాల్లో AQI 300 కంటే ఎక్కువగా ఉంది. రాజధానిలో కాలుష్యం ఆందోళకరంగా మారడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇచ్చారు.