కడప నూతన YCP మేయర్ ఇతనే..!
కడప నగరం నూతన మేయరుగా పాక సురేష్ ఎన్నికయ్యారు. కాసేపటి క్రితం కడపలోని MP నివాసంలో జరిగిన సమావేశంలో YS అవినాష్ రెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా 47వ డివిజన్ కార్పొరేటర్ పాక సురేష్ పేరును వైసీపీ కార్పొరేటర్లు ఆమోదించారు. దీంతో రేపు ఉదయం 11 గంటలకు నగరపాలక సంస్థ కార్యాలయంలో నూతన మేయరుగా పాక సురేష్ ఎన్నిక, ప్రమాణ స్వీకారం చేయనున్నారు.