బాబురావుకి నివాళులర్పించిన మాజీ హోంమంత్రి

W.G: రాష్ట్ర మాజీ హోం మంత్రి తానేటి వనిత మావయ్య తానేటి బాబురావు బుధవారం ఉదయం అనారోగ్యంతో పాలకొల్లులో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆమె పాలకొల్లు వచ్చి బాబురావు భౌతికకాయానికి నివాళులర్పించారు. మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్ యడ్ల తాతాజీతో పాటు పలువురు వైసీపీ నాయకులు నివాళులర్పించారు. మధ్యాహ్నం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.