బంజారా సమాజానికి మౌలిక సదుపాయాలు: ఎమ్మెల్యే
NLG: కొండమల్లేపల్లిలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న బంజార భవన్ ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శుక్రవారం ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ శంకుస్థాపన చేశారు. బంజార సమాజానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. బంజార భవన్ నిర్మాణం ద్వారా బంజార సమాజానికి చెందిన ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు.