వేసవి శిక్షణ శిబిరంను సందర్శించిన ఎంఈవో

NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తి జి.ప.ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరంను గురువారం ఎంఈవో సైదా నాయక్ సందర్శించారు. ఇండోర్ గేమ్స్, కంప్యూటర్ విద్య, డ్రాయింగ్, డాన్స్, స్పోకెన్ ఇంగ్లీష్ వంటి అంశాల్లో శిబిరం ఇంఛార్జి చంద్రశేఖర్, నవ్య విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. చల్లటి వాతావరణంలో వివిధ రకాల అంశాల పట్ల మక్కువ కనబరుస్తున్నారు.