వారంలో భారీగా పెరిగిన ధరలు

వారంలో భారీగా పెరిగిన ధరలు

VKB: జిల్లాలో దాదాపు అన్ని చోట్లా టమాటా ధరలు రోజురోజుకీ పెరుగుతూ వినియోగదారులకు భారం అవుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో టమాటా ధర కిలో రూ.30-రూ.40 వరకు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరఫరా తగ్గడం, రవాణా ఖర్చులు పెరగడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా వ్యాపారులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.