జాతీయ రహదారిపై ప్రజలు నిరసన

జాతీయ రహదారిపై ప్రజలు నిరసన

CTR: పుంగనూరు-బెంగళూరు జాతీయ రహదారి అధ్వాన్నంగా ఉంది. రోడ్డు తవ్వి కంకర వేసి గత కొన్ని నెలలుగా వదిలేశారు. దుమ్ము, ధూళితో చిన్నారులు, పెద్దలు అనారోగ్యానికి గురవుతున్నారని స్థానికులు వాపోయారు. వెంటనే అధికారులు స్పందించి రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రోడ్డుపై స్థానికులు బైఠాయించి నిరసన తెలిపారు.