VIDEO: ఫుట్‌బాల్ మైదానాన్ని పరిశీలించిన శివసేన రెడ్డి
WNP: జిల్లాలోని నైపుణ్యం కలిగిన క్రీడాకారులను, యువతను ప్రోత్సహించి క్రీడలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యమని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేన రెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఖేలో ఇండియా ఫుట్‌బాల్ మైదానాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో క్రీడల అభివృద్ధికి కలెక్టర్ ఎంతో సహకరిస్తున్నారని తెలిపారు.