అభయాంజనేయ స్వామి హుండీ ఆదాయం లెక్కింపు

అభయాంజనేయ స్వామి హుండీ ఆదాయం లెక్కింపు

కృష్ణా జిల్లాలో ప్రసిద్ధిగాంచిన బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి ఆలయ హుండీని 85 రోజుల తర్వాత బుధవారం లెక్కించారు. మొత్తం రూ.12,08,963 ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో తారకేశ్వరరావు తెలిపారు. ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ బి. సురేష్‌కుమార్ పర్యవేక్షణలో భజన సమాజం, ఆర్యవైశ్య సంఘం సభ్యులు లెక్కింపులో పాల్గొన్నారు.