దివ్యాంగ విద్యార్థుల ఉపకరణాల గుర్తింపు శిబిరం

దివ్యాంగ విద్యార్థుల ఉపకరణాల గుర్తింపు శిబిరం

SRD: సంగారెడ్డి పట్టణంలోని భవిత కేంద్రంలో దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల గుర్తింపు శిబిరాన్ని బుధవారం నిర్వహించారు. సమగ్ర శిక్ష విలీన విద్య కోఆర్డినేటర్ వెంకటేశం శిబిరాన్ని ప్రారంభించారు. వైద్యులు దివ్యాంగ విద్యార్థులకు వైద్య పరీక్షలను చేశారు. అర్హులైన దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాలను అందిస్తామని కోఆర్డినేటర్ వెంకటేశం తెలిపారు.